మంగళవారం, 04 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘డేర్ డెవిల్’గా అజిత్ కొత్త సినిమా

5 గంటల క్రితం

ajith
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 08:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రానికి టైటిల్ ఖరారైంది. ఇప్పటివరకు ‘ఏకే 64’ (AK 64) పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘డేర్ డెవిల్’ అనే పేరును ఖరారు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ.. నటుడిగానే కాకుండా నిజ జీవితంలోనూ రేసర్‌గా రాణిస్తూ గత 20 నెలల్లో పలు ట్రోఫీలు గెలుచుకున్న అజిత్ వ్యక్తిత్వానికి ‘డేర్ డెవిల్’ అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని పేర్కొన్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అజిత్ సతీమణి షాలిని, వారి సొంత నిర్మాణ సంస్థ ‘బ్రేవ్‌హార్ట్స్ ప్రొడక్షన్స్’ పతాకంపై నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్