ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తేజ‌స్ యుద్ధ‌ విమానంలో ప్ర‌యాణించిన జ‌పాన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌

47 నిమిషాల క్రితం

schee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 01:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

జోధ్‌పుర్‌ : భారత్ కు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌ లో జపాన్‌ ఎయిర్ సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ అధిపతి జనరల్‌ టకెహిరో మొరిటా ప్రయాణించారు. ఆయనతోపాటు భారత వాయుసేన చీఫ్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా తేజస్‌లో ప్రయాణించారు. ఆదివారం ఉదయం భారత్‌-జపాన్‌ ద్వైపాక్షిక వాయుసేన సంయుక్త విన్యాసాలు వీర్‌ గార్డియన్‌-2026లో భాగంగా జోధ్‌పుర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ కేంద్రంగా నిర్వహించారు. తొలుత వాయుసేన స్థావరానికి వచ్చిన వీరు తమకు కేటాయించిన తేజస్‌ విమానాల వద్దకు చేరుకొన్నారు. భారత పైలట్‌తో కలిసి జపాన్‌ వాయుసేన అధిపతి విమానం నడపగా.. ఐఏఎఫ్‌ చీఫ్‌ స్వయంగా మరో తేజస్‌ విమానాన్ని నడిపారు. ఈ విన్యాసాల్లో భారత్‌-జపాన్‌ యుద్ధ వ్యూహాలను కూడా పంచుకొన్నాయి. ఈ విన్యాసాల్లో భారత్‌ సుఖోయ్‌-30 ఎంకేఐ, రఫేల్‌ ఫైటర్‌జెట్‌, ఎల్‌సిఎ తేజస్‌ విమానాలు భారత్‌ నుంచి పాల్గొనగా..జెఎఎస్‌డిఎఫ్‌ నుంచి ఎఫ్‌-2ఏ ఫైటర్‌ జెట్‌ పాల్గొన్న‌ది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్