షోస్టాపర్స్ 2026 ప్రత్యేక సంచికలో చోటు
సినిమా : అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా ‘షోస్టాపర్స్ 2026’ ప్రత్యేక సంచిక కవర్ పేజీపై ఆయన మెరిశారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితులు, చిత్ర విజయానికి కథ ప్రాధాన్యతపై తన అభిప్రాయాలను అల్లు అర్జున్ వెల్లడించారు. బాలీవుడ్, దక్షిణాది లేదా ఇతర ప్రాంతీయ చిత్ర పరిశ్రమ ఏదైనా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకాదరణ పొందాలంటే కథే ప్రధానమని ఆయన అన్నారు. మంచి కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని తెలిపారు. కొత్త కథను ప్రేక్షకులకు అందించడమే అన్నింటికంటే ముఖ్యమని అన్నారు. నటీనటుల స్టార్‌డమ్ కంటే సరైన కథే సినిమా విజయాన్ని నిర్ణయిస్తుందని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డారు.
100 మంది తారలకు చోటు
2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు సినిమాలు, ఓటీటీ, క్రీడలు, సంగీతం, టెలివిజన్ తదితర రంగాల్లో విశేష ప్రభావం చూపిన 100 మంది ప్రముఖులతో ‘షోస్టాపర్స్ 2026’ జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో అల్లు అర్జున్‌తో పాటు అమితాబ్ బచ్చన్, మోహన్‌లాల్, రజనీకాంత్, రామ్‌చరణ్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, ఎఆర్ రెహమాన్, బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్, మాధవన్, రణ్‌వీర్ సింగ్, రిషబ్ శెట్టి, కల్యాణి ప్రియదర్శన్, కంగనా రనౌత్ తదితర ప్రముఖులు చోటు దక్కించుకున్నారు.







కామెంట్‌లు (0)