ప్రజాశక్తి - ఆలమూరు : ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూచనలతో హెచ్ఐవి నిర్మూలనకు మండలంలోని మడికి, కొత్తూరు సెంటర్ తదితర ప్రదేశాలలో రామచంద్రపురం గొర్రెల శ్రీనివాసరావు కళాజాత బృందం ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెచ్‌ఐవిని 1988 డిసెంబర్ 1న గుర్తించడంతో ఆ రోజున ఎయిడ్స్ వ్యాధి నివారణకు టీకాతో చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. హెచ్ఐవి సోకిన కారణంగా ఇమ్యూన్ సెల్స్ చనిపోతున్న కొద్దీ శరీరానికి వివిధ రకాల ఇన్‌ఫెక్షన్స్, క్యాన్సర్స్ సోకే ప్రమాదం ఉందన్నారు. వాటిలో హెచ్‌ఐవి తొలి లక్షణాలు సాధారణంగా జ్వరం, చలి, కండరాల నొప్పులు, గొంతు నొప్పి, దద్దుర్లు, నోటి పూత, నీరసం, గ్రంథుల వాపు వంటి ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయన్నారు. ఇవి వైరస్ సోకిన కొద్ది వారాల్లోనే శరీరంపై ప్రభావం కనిపించవచ్చు అన్నారు. హెచ్ఐవి ఎలా రాదు, ఏ విధంగా వస్తుందనే అంశంపై క్షుణ్ణంగా వివరించారు. సోకినట్లు అనుమానం ఉంటే 1097 నెంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలియచేయాలన్నారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాల జోలికి పోవద్దని, దీంతో ఎన్నో అసాంఘిక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కళాజాత బృందం సూచించారు.
హెచ్ఐవి నిర్మూలనకు అవగాహన కల్పిస్తున్న కళాజాత బృందం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 27, 2026, 05:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)