లక్నో : కాన్పూర్‌లో శిక్షణా విమానం గురువారం ఉదయం కూలిపోయింది. ఈ ఘటనలో పైలెట్, ట్రైనర్ మరణించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. గార్గ్ ఏవియేషన్ లిమిటెడ్‌కి చెందిన టెక్నామ్ పి2006టి అనే రెండు ఇంజిన్ల విమానం కాన్పూర్ సివిల్ విమానాశ్రయం సమీపంలో శిక్షణనిస్తోంది. ఈ విమానం విటి-ఎన్‌బివి రిజిస్ట్రేషన్ కలిగి ఉంది. గురువారం ఉదయం 11.40 గంటలకు టేకాఫ్ అయిందని, 20 నిమిషాలకే విమానం కూలిపోయిందని అధికారులు తెలిపారు. విమానాశ్రయానికి సుమారు 5 నాటికల్ మైళ్ల దూరంలో గంగా బ్యారేజ్ సమీపంలో విమానం కూలిపోయిందని అన్నారు. ట్రైనర్‌కి సుమారు 3,000గంటలు విమానం నడిపిన అనుభవం ఉంది. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) తెలిపింది.
కాన్పూర్‌లో కూలిన శిక్షణా విమానం.. ఇద్దరు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 27, 2026, 04:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)