* కోతుల బెడదకు స్టీల్ మెష్.. విద్యార్థుల కోసం మరుగుదొడ్లు, వర్షపు నీరు కారకుండా సిమెంట్ రేకులకు మరమ్మతులు
* విద్యార్థుల సమస్యలను స్వయంగా పరిశీలించిన యాక్ట్స్ ప్రెసిడెంట్ డాక్టర్ జి. దశరథ రెడ్డి
ప్రజాశక్తి-పీలేరు:
పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య అందిస్తున్న పీలేరు ప్రభుత్వ ఐటీఐలో మౌలిక సదుపాయాల కొరతపై యాక్ట్స్ (ఏసిటిఎస్) స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ జి. దశరథ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. విద్యార్థుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి సుమారు రూ.2 లక్షల విలువైన అభివృద్ధి పనులకు అనుమతి మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఐటీఐలోని తరగతి గదుల షెడ్, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించి, మౌలిక వసతుల కొరతపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఐటీఐ ప్రాంగణంలో కోతుల బెడదతో అటు విద్యార్థులు ఇటు బోధన సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఆయన కోతులు రాకుండా మోష్ ఏర్పాటుకు సహకరించారు. విద్యార్థుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణం, దెబ్బతిన్న సిమెంట్ రేకుల మార్పు తదితర పనులను చేపట్టేందుకు సుమారు రూ.2 లక్షల అంచనాతో పనులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు. డాక్టర్ దశరథ రెడ్డి సేవాభావాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో గూడరేవుపల్లికి చెందిన ద్వారక రెడ్డి, ఐటీఐ ప్రిన్సిపాల్ పీ. నారాయణ, ట్రైనింగ్ ఆఫీసర్ కె. బాలమురళి, సూపరింటెండెంట్ సి. మునిస్వామి, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు టి. ఆది నారాయణ రెడ్డి, విజయ కుమార్, ముని కుమార్ రెడ్డి, గౌతమ్ పుల్లా రావు, శివ కృష్ణ, సిబ్బంది భారతమ్మ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. తమ కళాశాలను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూసి సాయపడాలని స్థానిక సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వినీల, కంప్యూటర్ శిక్షణ విభాగానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా డాక్టర్ జి. దశరథరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.








కామెంట్‌లు (0)