శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అనిరుధ్-కావ్య రిసెప్షన్.. చెన్నైలో సినీ, క్రికెట్ దిగ్గజాల సందడి

10 గంటల క్రితం

Anirudh Kavya reception A star studded gathering of cinema and cricket legends in Chennai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 03:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తరలివస్తున్నారు. నవంబర్ 11 న గ్రీస్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట.. నేడు (నవంబర్ 21) చెన్నైలో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు హాజరయ్యేందుకు పలువురు ప్రముఖులు చెన్నై చేరుకుంటున్నారు. దీంతో విమానాశ్రయంలో సందడి నెలకొంది.
mahesh babu

ఈ వేడుకకు హాజరయ్యేందుకు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్స్‌, ఆ జట్టు మాజీ క్రికెటర్ డేనియల్ వెటోరీ, దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ తమ కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైకి చేరుకున్నారు. అటు టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన కుటుంబంతో కలిసి ఈ వేడుకకు హాజరవుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా వీరిద్దరి వివాహం నవంబర్‌ 11న గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా కొంతమంది హాజరయ్యారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్