హైదరాబాద్ : ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు గతంలో జానీ మాస్టర్ పై విధించిన నిషేధం కొనసాగుతుందని ఫిలిం ఫెడరేషన్ స్పష్టం చేసింది. బుధవారం నిర్వహించిన జనరల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఈ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత తీరుపై కౌన్సిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినీ పరిశ్రమ పెద్దలు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫెడరేషన్ సూచనలను ఖాతరు చేయకుండా డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఉప ఎన్నికలను నిర్వహించడాన్ని కౌన్సిల్ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో డ్యాన్సర్స్ ఫెడరేషన్‌కు ఫిలిం ఫెడరేషన్ సహకరించబోదని, డ్యాన్సర్లకు మాత్రం వ్యక్తిగతంగా సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. పరిశ్రమలోని మిగిలిన 23 క్రాఫ్ట్స్‌కు ఎప్పటిలాగే సహకారం అందిస్తామని తెలిపింది. అంతేకాకుండా, గతంలో ఆయన ఫెడరేషన్‌కు అందజేసిన రూ. 3 లక్షల మొత్తాన్ని తిరిగి ఆయనకే వెనక్కి పంపుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ .... పరిశ్రమలో క్రమశిక్షణ, నిబంధనలను ఉల్లంఘించే చర్యలను ఏమాత్రం సహించేది లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు తప్ప మిగిలిన 24 శాఖల (క్రాఫ్ట్స్) సంఘాలకు ఫెడరేషన్ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలోని కార్మికుల హక్కుల పరిరక్షణ తో పాటు నిబంధనలకు కట్టుబడి పనిచేసే యూనియన్లకే తమ సహకారం ఉంటుందని కౌన్సిల్ సభ్యులు ముక్తకంఠంతో వెల్లడించారు.
జానీమాస్టర్ పై నిషేధం కొనసాగుతుంది : ఫిలిం ఫెడరేషన్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 19, 2026, 04:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)