సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చిలకలపాడు అంగన్వాడి టీచర్ అనారోగ్యంతో మృతి

51 నిమిషాల క్రితం

Chilakalapadu Anganwadi teacher dies of illness.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 03:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : ఈ నెల 18 న మండలంలోని మడికికి చెందిన స్థానిక శివారు చిలకలపాడు అంగన్వాడి కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న టీచర్ పి.రమణ అనారోగ్యంతో మృతి చెందారని మండల అంగన్వాడిల సంఘం అధ్యక్షులు యు.సుశీల సోమవారం తెలిపారు. ఆమెకు భర్త, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. వారిలో చిన్నమ్మాయికి ఇంకా వివాహం కాలేదని తెలిపారు. రమణ టీచర్ ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి ఈనెల 18న మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు మండల సంఘం తరఫున కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్