సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సత్యసాయిలో 32 మండలాలను కరువు మండలాలుగా ప్రకటన చేయాలి

52 నిమిషాల క్రితం

Thirty-two mandals in Satya Sai district must be declared drought-hit mandals.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 03:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -రొద్దం (అనంతపురం) : సత్యసాయి జిల్లాలో 32మండలాలను కరువు మండలాలుగా ప్రకటన చేసి సహాయక చర్యలు చేపట్టాలి అని ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ కు ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ, ఎపి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఫక్రుద్దీన్ కలసి వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా హరి మాట్లాడుతూ .... రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్రంగా కమ్ముకున్నాయి అని ఎల్ నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయిఅని,రాష్ట్ర వ్యాప్తంగా 55 % లోటు వర్షపాతం, సత్యసాయి జిల్లాలలో 69% లోటు వర్షపాతం నమోదు అయ్యింది, సత్యసాయి జిల్లాలలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి అన్నారు. బోర్లలో నీళ్లు లేక చీని, బత్తాయి, నారింజ వంటి ఉద్యాన పంటల చెట్లు ఉన్న రైతులు తొలగిస్తున్నారు అని అన్నారు. బోర్లు, చెరువుల క్రింద సాగుచేసిన వరి, పత్తి, మిరప, మొక్కజొన్న వంటి వేసిన కొద్ది పంటలు కూడా చేతికి వస్తాయో, రావో అనే ఆందోళనలో రైతులు ఉన్నారు అన్నారు. జిల్లాలలో వర్షాభావం వల్ల పశువులు, గొర్రెలు, మేకలకు మేత, నీళ్ల సమస్య ఉన్నది అన్నారు. పాల రైతులు, పశు పోషకులు, గొర్రెలు, మేకల పెంపకం దారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అన్నారు. కావున పశువులకు పశుగ్రాసం కేంద్రాలను ఏర్పాటు చేయాలి కోరారు. పశుపోషనకు బ్యాంకుల నుండి 90 % సబ్సిడీతో రుణాలు ఇవ్వాలి అన్నారు. వర్షాలు లేక, వ్యవసాయ పనులు లేక మరియు మార్కెట్ లో పెరిగిన నిత్యావసరాల ధరలు పెరిగి భూమిలేని వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కరువు కాలంలో నిబంధనలు సడలించి ఉపాధి పనులు కల్పించి ఆదుకోవలసిన ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉపాధి పనులు పెట్టటం లేదు అన్నారు. నిబంధనలు సడలించి అడిగిన వారందరికీ ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. పట్టణాలలో పట్టణ ఉపాధి హామీ పథకం అమలు చేయాలి అని, గ్రామీణ పట్టణ పేదలకు ఉపాధి కల్పించాలి అన్నారు. ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువుగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని, రైతులకు రూ. 2.00 లక్షల వరకు రుణాలు మాఫీ చేసి కొత్తగా రుణాలు ఇవ్వాలని, అసలు పంటలే వేయని రైతులకు ఎకరాకు రూ. 10 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, పంటలు వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, అన్ని పంటలకు ఉచిత బీమా అమలు చేయాలని, రైతులు చెల్లించిన బీమా ప్రీమియం ప్రభుత్వం రైతులకు రీయంబర్స్ చేయాలని, త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామీణ పేదలకు ఉపాధి పనులు కల్పించాలని, కరువు ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, చక్కెర, చింతపండు, కారం, పసుపు వంటి 8 రకాల నిత్యావసర వస్తువులు 6 నెలల పాటు తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా ఇవ్వాలని ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు.లో జె నారాయన,ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఫక్రుద్దీన్ తదితరులు పాల్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్