బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Toxic - పిల్లలు 'టాక్సిక్` సినిమాను చూడొద్దు : యశ్

53 నిమిషాల క్రితం

Children should not watch the movie 'Toxic': Yash
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 11:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : ఈ నెల 26 న విడుదల కానున్న ‘టాక్సిక్‌ : ఎ ఫెయిరీటేల్‌ ఫర్‌ గ్రోన్‌అప్స్‌’ సినిమా పై తాజాగా హీరో యశ్ స్పందిస్తూ .... ఈ సినిమా కేవలం పెద్దవారి సినిమా మాత్రమేనని.. పిల్లలు చూడొద్దు అని సూచించారు. యశ్‌ ప్రధానపాత్రలో గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. దీనిపై యశ్ మాట్లాడుతూ .... ఇది కేవలం పెద్దవాళ్ల సినిమా అని స్పష్టం చేశారు. పిల్లలు ఈ సినిమా చూడొద్దు అని చెప్పారు. ఇది పెద్దల కోసం మాత్రమే తీశామన్నారు. ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నానన్నారు. పెద్దలకు తప్పొప్పులు తెలుసు. వాళ్లు ఈ సినిమా నుంచి ఏం నేర్చుకోవాలో నిర్ణయించుకుంటారనీ, జీవితంలో ఏం చేయాలి, ఏం చేయకూడదనే విచక్షణ వారికి ఉంటుందని, అందుకే వాళ్ల కోసమే చాలా నిజాయతీగా ఈ చిత్రం రూపొందించామని యశ్ వివరించారు. ఇందులోని అశ్లీల సన్నివేశాల గురించి యశ్‌ మాట్లాడారు. విమర్శలను తోసిపుచ్చారు. ‘' ఈ చిత్రం మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది. కథ నిర్దిష్టమైన దిశకు చేరుకోవాలంటే ప్రతి పాత్రలోని వేర్వేరు పొరలను ఆవిష్కరించడం చాలా ముఖ్యం. ట్రైలర్‌, పాటలపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అవి కేవలం రెండు పాత్రల మధ్య ప్రేమను ఆవిష్కరించే సన్నివేశాలు మాత్రమే. వాటిని అలా మాత్రమే చూడండి. గీతూ మోహన్‌దాస్ ఒక దర్శకురాలు.. మహిళలకు కూడా భావోద్వేగాలు పంచుకునే హక్కు ఉంటుంది. కేవలం పబ్లిసిటీ కోసం కాకుండా, కథలోని ప్రాధాన్యతను బట్టే ఆయా సన్నివేశాలు చిత్రీకరించాం ’’ అని యశ్‌ అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్