- గుంటూరులో జూనియర్ వైద్యుల సమ్మె
గుంటూరు: జూనియర్ వైద్యుల సమ్మె గుంటూరులో కొనసాగుతోంది. బుధవారంతో సమ్మె 10వ రోజుకు చేరుకుంది. జీజీహెచ్ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో పెద్ద సంఖ్యలో జూనియర్ వైద్యులు పాల్గొని నిరసన తెలిపారు. స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. విధుల్లో ఉన్న వైద్యులకు భద్రత కల్పించాలని, ఆసుపత్రిలో మౌలిక వసతులను మెరుగుపరచాలని, ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. “పని పెరిగింది.. ఖర్చులు పెరిగాయి.. స్టైఫండ్ ఎందుకు పెంచరు?” అంటూ జూనియర్ వైద్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని జూనియర్ వైద్యులు హెచ్చరించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.








కామెంట్‌లు (0)