బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థుల సమస్యలపై పోరాటం ఉధృతం

1 గంట క్రితం

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 12:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కురుపాం : విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.అనిల్ తెలిపారు. ఆగస్టు 29, 30 తేదీల్లో పార్వతీపురం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఎస్‌ఎఫ్‌ఐ పార్వతీపురం మన్యం జిల్లా ప్లీనరీ సమావేశాల పోస్టర్లను బుధవారం కురుపాం పోస్ట్‌మెట్రిక్ బాలుర వసతి గృహం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ జిల్లాలో సంక్షేమ వసతిగృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్ మెస్ బిల్లులు విడుదల చేయాలని, మెస్‌, కాస్మోటిక్స్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఏఎన్‌ఎం పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్లీనరీలో జిల్లాలోని విద్యారంగ సమస్యలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. సమావేశాలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జి.సురేష్, మండల, హాస్టల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్