హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం నుంచి భోగాపురానికి వెళ్లే ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉండగానే దుండగులు ఈ బెదిరింపు మెయిల్ పంపించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కు చెందిన అధికారులు బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి తనిఖీలు చేపట్టారు. ఎయిర్‌పోర్టు అంతటా అణువణువూ నిశితంగా సోదాలు చేశారు. మరోవైపు బాంబు బెదిరింపు మెయిల్‌పై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
భోగాపురానికి వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 19, 2026, 12:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)