సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కృష్ణ డైలాగ్ మహేష్ బాబు చెబితే..!

1 గంట క్రితం

If Mahesh Babu delivers Krishna's dialogue...!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 01:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా .... సినీ ప్రముఖులు, అభిమానులు ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా చేసిన ఓ ప్రత్యేక పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సందీప్‌ ఎఐ వీడియోతో శుభాకాంక్షలు చెప్పగా, మహేశ్‌ ఫిదా అయ్యారు. లెంజడరీ సినీనటుడు కృష్ణ నటించిన ‘కిరాయి కోటిగాడు’ సినిమాలో చెప్పిన ఓ డైలాగ్‌ను ఎఐతో రీక్రియేట్‌ చేసి పోస్ట్‌ చేశారు. ఇది ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్పిరిట్‌. భద్రకాళి పిక్చర్‌, టి. సిరీస్‌ బ్యానర్స్‌పై భూషణ్‌ కుమార్‌, ‍ప్రణయ్‌ రెడ్డి వంగా, కృష్ణ కుమార్‌, ప్రభాకర్‌ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. త్రిప్తి దిమ్రి హీరోయిన్‌. మహేష్ బాబు విషయాని​కి వస్తే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్రంతో 2027లో ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

https://www.youtube.com/shorts/zqYX1nFcXVk



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్