సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Live Updates: అఖిలపక్ష కార్మికసంఘాల జైల్ భరో

1 గంట క్రితం

jail baro 8
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 11:36 పూర్వాహ్నం | 0 నిమిషాల చదవడం

Live Updates
5 minutes agoAug 10, 2026 12:40 PM IST

nz
నూజివీడు పట్టణంలోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో రైతు, వ్యవసాయ కార్మిక కార్మిక సంఘాలు సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నిరసన కార్యక్రమం..

10 minutes agoAug 10, 2026 12:35 PM IST

gnt

గుంటూరు : కేంద్ర కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జైల్ భరో కార్యక్రమంలో భాగంగా గుంటూరులో వివిధ సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన సోమవారం నిర్వహించారు. స్థానిక తాలూకా వద్ద ప్రధాన రహదారిపై బైటయించిన నిరసన కారులను పట్టణ పోలీసులు కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో నిరసన కారులు పోలీస్ స్టేషన్లో బైటయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదలు చేశారు .

15 minutes agoAug 10, 2026 12:30 PM IST

krishna

ఉయ్యురు:కేంద్ర కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలోని ఉయ్యురు బిఎస్ఎన్ ఎల్ కార్యాలయము ఎదురుగా రాస్తా రోకో

35 minutes agoAug 10, 2026 12:09 PM IST

pitapuram

పిఠాపురం: కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన జైలు భరో కార్యక్రమంలో భాగంగా పిఠాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు కార్మిక,రైతు,ప్రజా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు.

39 minutes agoAug 10, 2026 12:05 PM IST

ongle 1
ప్రకాశం జిల్లాలో జైలు భరోలో పాల్గొన్న అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు

about 1 hour agoAug 10, 2026 11:51 AM IST

chitoor
చిత్తూరులో జైలు బరో కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి నిరసన

about 1 hour agoAug 10, 2026 11:50 AM IST

nellor 1
nellor 2
నెల్లూరు: క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో గాంధీ బొమ్మ నుంచి ఆర్ సి వరకు నాయకులు ర్యాలీ నిర్వహించారు. వి ఆర్ సి దగ్గర రాస్తారోకో చేపట్టిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

about 1 hour agoAug 10, 2026 11:48 AM IST

bapatla

జైల్ భరో ఉద్యమంలో పాల్గొన్న జిల్లా కౌలు రైతు సంఘం ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్యను బాపట్లలో పోలీసులు అరెస్ట్ చేశారు.

about 1 hour agoAug 10, 2026 11:47 AM IST

manyam 2

manyam 5

మన్యం జిల్లాలో నాయకులు అరెస్టు

about 1 hour agoAug 10, 2026 11:46 AM IST

ప్రజాశక్తివిశాఖపట్నం: కార్మికుల సమస్యల పరిష్కారం, తమ డిమాండ్ల సాధన కోసం అఖిలపక్ష కార్మిక సంఘాలు విశాఖపట్నం చేపట్టిన జైలు భరో కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని నాయకులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఎం. జగ్గు నాయుడు, ఆర్.కె.ఎస్.వి. కుమార్, ఎం.సుబ్బారావు కుమారి, ఐఎన్‌టీయూసీ నాయకులు ఆదినారాయణ, పడాల రమణ, మంత్రి రాజశేఖర్త, ఏఐటీయూసీ నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

jail baro 2

jail baro 4

jail baro 7


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్