శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చినరావూరుతోటలో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌

11 నిమిషాల క్రితం

police2.jpeg.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 10:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 35 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా): తెనాలి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చినరావూరుతోటలో శనివారం తెల్లవారుజాము నుంచి పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఇళ్లు, పరిసర ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాలను తనిఖీ చేయడంతో పాటు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, వినియోగంపై తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేసి వాటి పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా 35 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అనంతరం ‘సంకల్పం’ కార్యక్రమం నిర్వహించి యువత, ప్రజలకు మాదకద్రవ్యాల వల్ల కలిగే వ్యక్తిగత, కుటుంబ, సామాజిక నష్టాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా బి. జనార్ధన్‌రావు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితంతో పాటు కుటుంబంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. మాదకద్రవ్యాల విక్రయం, రవాణా, నిల్వ, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు నిరంతరం తనిఖీలు చేపడుతున్నారని తెలిపారు. ఈగల్‌ టీమ్‌ డీఎస్పీ త్రినాథ్‌ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా క్రీడలు, విద్య, ఉపాధి, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. నిషేధిత మత్తు పదార్థాల వినియోగంపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ ఆపరేషన్‌లో పట్టణ వన్‌టౌన్‌ సీఐ సీహెచ్‌ రాంబాబు, రూరల్‌ సీఐ నాయబ్‌ రసూల్‌, ఎస్‌ఐ సునీల్‌తో పాటు దాదాపు 60 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్