శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Asian Games: భారత మహిళల కబడ్డీ జట్టుకు స్వర్ణం

13 నిమిషాల క్రితం

kabaddi.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 11:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఫైనల్లో ఇరాన్‌పై 37-34తో విజయం

ఆసియా క్రీడలు-2026లో భారత మహిళల కబడ్డీ జట్టు స్వర్ణ పతకం సాధించింది. శనివారం జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్లో భారత్‌ 37-34తో ఇరాన్‌ను ఓడించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్‌ చివరి వరకు హోరాహోరీగా సాగింది. కీలక సమయంలో భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించి విజయాన్ని ఖాయం చేసుకుంది. దీంతో ఆసియా క్రీడల మహిళల కబడ్డీలో భారత్‌కు నాలుగో స్వర్ణ పతకం లభించింది. భారత మహిళల జట్టు గతంలో 2010, 2014, 2022 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించింది. 2018లో రజత పతకంతో సరిపెట్టుకుంది. 2022లో చైనీస్‌ తైపీని 26-25తో ఓడించి టైటిల్‌ సాధించిన భారత్‌.. 2026లోనూ అదే జోరును కొనసాగించి స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్