తమిళ నటుడు సూరి హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'మండాడి'. ఈ చిత్రంలో టాలీవుడ్ యాక్టర్ సుహాస్ విలన్ గా నటిస్తున్నాడు. సెప్టెంబర్ 10న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.'సెల్ఫీ' ఫేమ్ మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్‌లో ఆయన అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. తమిళనాడు తీరప్రాంతంలో జరిగే సాంప్రదాయ పడవ పందేల (సైల్ బోట్ రేసింగ్) నేపథ్యంలో ఈ సినిమాను హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.
'మండాడి' ట్రైలర్‌ను విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 01:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)