ప్రజాశక్తి–కడప అర్బన్: స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేయడం బాధాకరమని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు హీరా మియ్య, కార్యదర్శి చిన్న మస్తాన్ అన్నారు. ఆదివారం ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (ఏఏఎస్) అమలుపై ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించిన ఉద్యోగ జేఏసీ చైర్మన్ ఎ. విద్యాసాగర్‌కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ రెండు డీఏలు ప్రకటించడంతోపాటు పీఆర్‌సీ కమిషన్ నియామకానికి అంగీకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులకు రావాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఏఏఎస్ ఇంక్రిమెంట్ల మంజూరుపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం, జాప్యం చేయడం సరికాదన్నారు. లక్ష మందికి పైగా ఉద్యోగులకు సంబంధించిన ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. నోషనల్ ఇంక్రిమెంట్లతో పాటు తొమ్మిది నెలల బకాయిలు (అరియర్స్) సహా ఉద్యోగులకు రావాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు
స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో జాప్యం బాధాకరం
50 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 01:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)