ఆదివారం, 06 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ తాత్కాలిక వాయిదా

57 నిమిషాల క్రితం

jac.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 01:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి: ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన చర్చల వివరాలను రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు తెలియజేసినట్లు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఇంకా కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఐఆర్‌ (ఇంటీరిమ్ రిలీఫ్), ఉద్యోగుల బకాయిల అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాలేదని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని బొప్పరాజు అన్నారు. అయితే తమ సమస్యలను పరిష్కరించకపోతే మళ్లీ ఉద్యమ కార్యాచరణ చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వంతో చర్చలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్