ప్రజాశక్తి–రాజంపేట: రాజంపేటలోని పీఎం శ్రీ బాలికల జడ్పీహెచ్‌ఎస్ ప్లస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే. జయలక్ష్మి జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిధిమీనాతో పాటు ఇతర ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఆమె ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శనివారం కడప నగరంలోని కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో జయలక్ష్మికి ఈ గౌరవం లభించింది. విద్యార్థుల అభ్యున్నతికి అంకితభావంతో, నిజాయితీగా సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కిందని పలువురు పేర్కొన్నారు. జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలిగా ఎంపికైన జయలక్ష్మికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, రాజంపేట మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలిగా జయలక్ష్మి
53 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 01:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)