హైదరాబాద్ : ' కల్యాణ్ బాబూ ... ప్రతి అడుగులోనూ విజయం సాధించాలి ` అని మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి పోస్టు చేశారు. ‘‘నిబద్ధత, బాధ్యత, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి.. ఇవన్నీ మా కల్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు. మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో.. తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ.. పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తున్నాడు. పవన్‌ను ఇలా చూస్తుంటే ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కల్యాణ్ బాబు.. ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని చిరు పేర్కొన్నారు.
ప్రతి అడుగులోనూ విజయం సాధించాలి : పవన్ కు చిరు శుభాకాంక్షలు
55 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 11:57 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)