బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మల్లారెడ్డి, సుమతుల స్పూర్తిని కొనసాగించాలి

1 గంట క్రితం

vzm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 12:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా పని చేసిన మల్లారెడ్డి, విద్యార్ది ఉద్యమ నాయకురాలిగా, ఐద్వా నాయకులుగా సుమతుల మరణం ప్రజా ఉద్యమానికి తీరని లోటు అన్నారు. అనేక రైతు పోరాటాలు నిర్వహించిన వ్యక్తి మల్లారెడ్డి అన్నారు. ఆయన. మేధాశక్తి ప్రజా ఉద్యమానికి, రైతు ఉద్యమాలకు ఎంతో దోహదపడ్డాయన్నారు. రాజ్యసభ సభ సభ్యులుగా పని చేసి మధు భార్యగా ఉండి ప్రజా ఉద్యమాలకు అంకితమయ్యారు సుమతి అన్నారు. వారికి వచ్చిన ఆదాయాలను ప్రజా ఉద్యమాలకు ఇచ్చిన త్యాగమూర్తులు అన్నారు. వారి సమ సమాజం కోసం వారిద్దరూ ఆయా వర్గాల్లో చేసిన సేవ ఆదర్శనీయమన్నారు. మల్లారెడ్డి జిల్లాలో అనేక రైతు పోరాటాల్లో పాల్గొన్నడం జరిగిందన్నారు. రైతులు సమస్యలపైన అనేక పుస్తకాలు రాసి, విజ్ఞానాన్ని అందించిన మేధావి అన్నారు. అన్ని వర్గాలు ప్రజలు సమస్యలు మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి అన్నారు. రైతు సంక్షోభాలు నుంచి బయటపడేందుకు అనేక వ్యాసాలు రాసిన మేధా శక్తి కలిగిన వ్యక్తి అన్నారు. వరంగల్ జిల్లాలో సర్పంచ్.గా చేసి ప్రజా ఉద్యమాలు ఆయన జీవితం అంకితం చేశారన్నారు. సుమతి గారు ప్రజా ఉద్యమాలకు వెన్నంటి ఉండి మధుకి పూర్తి సహకారం అందించి సహకరించిన వ్యక్తి అన్నారు. సిపిఎంకి, ప్రజా ఉద్యమాలకు వారు జీవితాలను అంకితం చేశారన్నారు. వారు అందించిన స్పూర్తితో ప్రజా ఉద్యమాలు బలోపేతం కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.లక్ష్మి, నాయకులు ఏ.జగన్మోహనరావు, డి.రాము, జి.శ్రీనివాసరావు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్