అమరావతి : కాసేపట్లో 72 వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించనున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల 30 నిముషాలకు అవార్డులను ప్రకటించనున్నారు. దీనికిగాను అధికార వర్గాలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి సహా వివిధ కేటగిరిల్లో పురస్కారాలు ఎవరికి దక్కుతాయనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. విభిన్న కథలు, వైవిధ్యమైన పాత్రలు, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఐదుగురు సినీనటుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారిలో తెలుగు నుంచి అల్లు అర్జున్ (పుష్ప 2) ఉండగా, ఈ రేసులో సీనియర్ హీరో మమ్ముట్టి (భ్రమయుగం) కూడా పోటీపడుతున్నట్లు తెలుస్తుంది. వీరితోపాటు, విక్రమ్ (తంగలాన్), సౌబిన్ షాహిర్ (మంజుమ్మల్ బాయ్స్), ఆసిఫ్ అలీ (కిష్కింద కాండం)లు ఉన్నారు.
కాసేపట్లో జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 18, 2026, 04:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)