ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఉత్తమ పనితీరును కనపరిచిన కమిషనర్ బాలస్వామికి ముఖ్యమంత్రి చంద్రబాబు అవార్డును ప్రదానం చేశారు. శనివారం గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో ఈ అవార్డును అందజేసి కమిషనర్ కు అభినందనలు తెలిపారు. ఇదే ఒరవడి తో విజయనగరం నగరపాలక సంస్థను ఆదర్శంగా తీర్చిదిద్దాలని స్ఫూర్తినిచ్చారు. 50 వేల నుండి 3 లక్షల జనాభా ఉన్న పురపాలక, నగరపాలక సంస్థలలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలను శత శాతం అమలు చేసిన రీత్యా ఈ అవార్డు లభించిందని కమిషనర్ బాలస్వామి తెలిపి ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని అభిలషించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, స్వచంద్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు.
సిఎం చంద్రబాబు చేతుల మీదుగా కమిషనర్ బాలస్వామికి క్లీన్ స్వీప్ అవార్డు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 18, 2026, 04:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)