గుడివాడ : రాష్ట్రంలో అక్టోబర్ 2 నాటికి చెత్తలేకుండా చేస్తామని సిఎం చంద్రబాబు అన్నారు. శనివారం గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. గుంటూరు, నెల్లూరు నగరాల్లో చెత్త సేకరణకు ఉపయోగించే, ఎలక్ట్రిక్ ఆటోలను వర్చువల్‌గా ప్రారంభించారు. బాగా పని చేసిన వారికి పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ .... చెత్త నుంచి సంపద సృష్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇంట్లో ఎవరికి వారే.. తడి, పొడి చెత్తను వేరు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మే 23 నుంచి జూన్ 20 వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం చేపట్టామన్నారు. ఆగస్టు 26 నాటికి 1140 ఈ-ఆటోలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 108 సమగ్ర ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాల కోసం రూ.528 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ‘ప్రజారథం’ కార్యక్రమం ద్వారా చెత్తను కొనుగోలు చేసి, నిత్యావసర వస్తువులు అందజేశామన్నారు. దీనికోసం ఇప్పటి వరకు రూ.16 కోట్లు ఖర్చు చేశామన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని చంద్రబాబు చెప్పారు. ఎవరి ఇంటిపై వాళ్లే కరెంటు తయారు చేసుకోవాలని సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
అక్టోబర్ 2 నాటికి ఎపిలో చెత్త లేకుండా చేస్తాం : సిఎం చంద్రబాబు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 18, 2026, 04:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)