శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గోదావరిలో చేపల వేటకు వెళ్లి గల్లంతు - ఐదుగురు మృతి

2 గంటల క్రితం

godavari five die
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 04:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎటపాక (అల్లూరి) : ఎటపాక మండలం తోటపల్లి గ్రామ పంచాయతీలోని గొల్లగూడెం గ్రామంలోని గోదావరి నది వద్ద చేపల వేటకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. ముగ్గురు మహిళలు లక్ష్మీ, భారతి, సుశీల, ఇద్దరు పురుషులు బాలరాజు, రమేష్ గల్లంతయ్యారు. నదిలో చేపలు పట్టేందుకు వెళ్లి లోతుగా ఉన్న ప్రాంతంలో దిగి గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు ప్రారంభించారు . అనంతరం ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు. ఊకే  సుశీల , ఊకే లక్ష్మి, తుర్రం భారతి, ఊకె రమేష్‌, బాలరాజు ఈ ఘటనలో మృతి చెందారు. వీరంతా గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా ఎపి మంత్రి సంధ్యారాణి ఘటనపై ఆరా తీశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్