అమరావతి : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలను యథాతథంగా కొనసాగించి, సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరుతూ .... సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి. నెం.144, తేదీ 11-07-2026 ద్వారా ఎస్సీ తదితర వెనుకబడిన విద్యార్థుల కోసం సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయడం స్వాగతించదగిన నిర్ణయమన్నారు. అయితే ఈ కేంద్రాల ఏర్పాటు పేరుతో దశాబ్దాలుగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న తాడికొండ, విశాఖపట్నం మేఘాద్రిగడ్డ, తిరుపతి జిల్లా కోటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలను మూసివేయడం కోసం ఇక్కడ ఉన్న విద్యార్థులను ఇతర స్కూల్స్‌కి తరలించడం సమంజసం కాదు అని చెప్పారు. గురుకుల పాఠశాలలను కొనసాగిస్తూనే, సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు అవసరమైన కొత్త భవనాలను లేదా ప్రత్యామ్నాయ ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసి ఏర్పాటు చేయవచ్చునని సూచించారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కాబట్టి మంత్రి బాలవీరాంజనేయ స్వామి వ్యక్తిగతంగా శ్రద్ధ పెట్టి వీటిని కొనసాగించేందుకు చర్య తీసుకోవాలని కోరారు. అలాగే సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను ప్రత్యేక ప్రాంగణంలో ఏర్పాటు చేయాలన్నారు. వీటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని, కనీసం ఉమ్మడి జిల్లాకు ఒకటైనా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయాలని వి.శ్రీనివాసరావు కోరారు.
గురుకుల పాఠశాలను యథాతథంగా కొనసాగించాలి : మంత్రి బాల వీరాంజనేయ స్వామికి వి.శ్రీనివాసరావు లేఖ
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 18, 2026, 04:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)