ఆదివారం, 15 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Giribabu - ప్రముఖ సినీనటుడు గిరిబాబు కన్నుమూత

12 గంటల క్రితం

Prominent film actor Giribabu passes away
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 04:37 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

హైదరాబాద్ : ప్రముఖ సినీనటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


గిరిబాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సంతాపం తెలియజేస్తున్నారు. తెలుగు సినిమాకు తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఓ విలక్షణ నటుడిని కోల్పోవడం సినీ రంగానికి తీరని లోటని పేర్కొంటున్నారు. అభిమానులు, సినీ ప్రేక్షకులు సైతం ఆయన మృతికి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.


giribabu family


గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. 1946 జూన్ 8న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించారు. నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన.. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రస్థానంలో తెలుగు సహా దక్షిణ భారతదేశంలోని పలు భాషా చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు. ముఖ్యంగా ప్రతినాయకుడి పాత్రల్లో తనదైన విలక్షణమైన నటనతో ప్రత్యేక ముద్ర వేశారు. తెరపై ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కుమారులు రఘుబాబు, బోసుబాబు కూడా సినీ రంగంతో అనుబంధం కలిగి ఉన్నారు.


‘జగమే మాయ’ సినిమాతో నటుడిగా పరిచయమైన గిరిబాబు.. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేశారు. నటనతో పాటు ‘సింహ గర్జన’, ‘మెరుపుదాడి’, ‘ఇంద్రజీత్’ చిత్రాలను నిర్మించారు. ‘రణరంగం’, ‘నీ సుఖమే నే కోరుకున్న’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయనకు ఇద్దరు కుమారులు రఘుబాబు, బోసుబాబు కాగా.. రఘుబాబు హాస్యనటుడిగా కొనసాగుతున్నారు. ఇక 2023లో విడుదలైన ‘అన్నీ మంచి శకునములే’ గిరిబాబు నటించిన చివరి చిత్రం. ఆయన అందించిన సినీ సేవలు, పోషించిన వైవిధ్యమైన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్