బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వారికి కూర్చునే సౌకర్యం కల్పించండి : సోనూసూద్‌

5 గంటల క్రితం

Provide them with seating arrangements Sonu Sood
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 01:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : విమానాశ్రయాలు, హోటళ్లలో విధులు నిర్వహించే ఉద్యోగుల పని పరిస్థితులపై సినీనటుడు సోనూసూద్‌ స్పందించారు. గంటల తరబడి నిలబడే సిబ్బందికి కూర్చుని విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించాలని సంబంధిత యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.


విమానాశ్రయాల్లోని చెక్‌-ఇన్‌ కౌంటర్లు, హోటళ్ల రిసెప్షన్లు, సర్వీస్‌ డెస్క్‌లలో పనిచేసే ఉద్యోగులు రోజుకు 10 నుంచి 12 గంటల పాటు నిలబడే విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. అలసటను భరిస్తూనే చిరునవ్వుతో వినియోగదారులకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఇంతసేపు నిలబడటం వల్ల వారి ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని యాజమాన్యాలు గుర్తించాలని సూచించారు. ప్రతి పని ప్రదేశంలోనూ ఉద్యోగులకు అనువైన ఎత్తైన స్టూల్స్‌ లేదా కుర్చీలను ఏర్పాటు చేయాలని కోరారు. అవసరమైనప్పుడు కూర్చొని విశ్రాంతి తీసుకునే వెసులుబాటు కల్పించాలని అన్నారు. ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించడమే హాస్పిటాలిటీ రంగం లక్ష్యమైనప్పుడు, ఆ సేవలందించే ఉద్యోగుల సౌకర్యం, సంక్షేమం పట్ల కూడా యాజమాన్యాలు అంతే బాధ్యతగా వ్యవహరించాలని సోనూసూద్‌ తన పోస్టులో పేర్కొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్