హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'రాకా'. ఈ చిత్రం విడుదలకు ముందే గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించింది. అత్యధిక మంది పెర్ఫార్మర్లను (37 మంది నటులు) రియల్ టైమ్లో ఏకకాలంలో మోషన్ క్యాప్చర్ చేసిన చిత్రంగా ఈ మూవీ గిన్నీస్ బుక్ లో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ- అర్జున్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల నుంచి సర్టిఫికెట్ అందుకున్న చిత్రాలను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో అర్జున్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. అట్లీ- అర్జున్ కాంబినేషన్ లో రాబోయే ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయింది. తాజాగా గిన్నీస్ రికార్డు సొంతం చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన 'రాకా` ..
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 09:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)