మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బీహార్ లో ఘోరం ..

53 నిమిషాల క్రితం

Girl harassed in the middle of the road
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 11:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నడి రోడ్డులో బాలికపై వేధింపులు

డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు


పాట్నా : బిజెపి డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలనలోని బీహార్ లో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా ఒక మైనర్ బాలిక, ఆమె స్నేహితుడిపై కొంతమంది దుండగులు దారుణంగా వేధింపులకు పాల్పడిన వీడియా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గత శనివారం సాయంత్రం జముయి పోలీస్ స్టేషన్ పరిధిలోని జముయి - లఖీసరాయ్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఈ వీడియోలో ఒక బాలిక ఆమె స్నేహితుడిని కొందరు వ్యక్తులు వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వీడియోలో కనిపించిన తొమ్మిది మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. "పోలీసులు బాధితురాలు, ఆమెస్నేహితుడిని సంప్రదించారు.

కోచింగ్ క్లాస్ ముగించుకుని తిరిగి వస్తుండగా, జముయి-లఖీసరాయ్ రోడ్డుపై ముసుగులు ధరించిన కొంత మంది వ్యక్తుల బృందం వారిని అడ్డుకుని వేధించింది” అని జముయి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పి) విశ్వజిత్ దయాల్ తెలిపారు. "ఈ ఘటనపై ఈ నెల 20న ఎఫ్ఎఆర్ నమోదు చేశారు. వైరల్ వీడియోలో కనిపించిన వారిలో కొందరిని ఇంకా అరెస్టు చేయలేదు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరినీ త్వరలో అరెస్టు చేస్తాం" అని దయాల్ తెలిపారు. ఈ ఘటనను బీహార్ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా సుమోటోగా స్వీకరించింది. విచారణ ప్రారంభించింది. దీనిలో ప్రమేయం ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్న మహిళలందరికీ అండగా నిలుస్తామని కమిషన్ చైర్పర్సన్ అప్సర తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా కుప్పకూలిందని ఆర్ జెడి అధికార ప్రతినిధి శక్తి సింగ్ యాదవ్ విమర్శించారు. పోలీసులు ఈ ఘటనపై త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్