నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రామాయణం: పార్ట్ వన్’ చిత్రానికి విడుదలకు ముందే భారీ స్పందన లభిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన ఐదు రోజుల్లోనే రెండు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ చిత్రం ప్రీ-సేల్స్ ద్వారా రూ.11.11 కోట్ల వసూళ్లు సాధించింది. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి హిందీ వెర్షన్‌లో అత్యధికంగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. మొత్తం అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లలో హిందీ వెర్షన్ వాటా సుమారు 87 శాతంగా ఉంది. మహారాష్ట్ర రూ.2.44 కోట్లతో ముందుండగా, ఢిల్లీ రూ.2.24 కోట్లు, కర్ణాటక రూ.1.71 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఆస్కార్ విజేతలు హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Print Edition‘రామాయణం’ అడ్వాన్స్ బుకింగ్స్ రూ.11 కోట్లు పైనే!
15 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 25, 2026, 10:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)