కేరళ : యువ దర్శకుడు బల్రాజ్ కలరిక్కల్ (చేగు) (27) హఠాన్మరణం చెందారు. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న యువ దర్శకుడు గత నెలలోనే ప్రేయసిని వివాహం చేసుకున్నారు. కొన్నేళ్లపాటు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్తో డైరెక్టర్ కావాలన్న తన కలను నెరవేర్చుకున్నారు. అయితే, ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే.. పిన్న వయసులోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. బేల్రాజ్ కలరిక్కల్ మరణవార్త మలయాళ చిత్రసీమలో విషాదం నింపింది. ‘కప్పి స్క్వాడ్’ శుక్రవారం జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కు రాగా, ఆ మరుసటి రోజే ఆయన ప్రాణాలు కోల్పోవడంపై సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిళల్, మధురం, డాకిని లాంటి చిత్రాలకు ఆయన సహాయ దర్శకుడిగా పనిచేశారు. బెల్రాజ్కు గత సెప్టెంబర్ లో వివాహం జరిగింది. ఆరేళ్ల సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత ఈ పెళ్లి జరిగింది. బెల్రాజ్ భార్య పేరు అతిర. మణిమాల, కలరిక్కల్ సురేష్ కుమారుడు. తల్లి పేరు స్మిత, సోదరి పేరు సోజ. బెల్ రాజ్ స్వస్థలం కొట్టాయం జిల్లా, మణిమాల. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో తన తొలి దర్శకత్వ చిత్రం విడుదలైన మరుసటి రోజే బెల్రాజ్ ఎర్నాకుళంలోని ఒక హోటల్ గదిలో విగతజీవిగా కనిపించారు. దర్యాప్తు కొనసాగుతుండగా, ఆయన పార్థివ దేహాన్ని సన్రైజ్ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
యువ దర్శకుడు బల్రాజ్ కలరిక్కల్ హఠాన్మరణం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 17, 2026, 03:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)