శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

10 కేజీల గంజాయి స్వాధీనం - ఇద్దరు అరెస్ట్

1 గంట క్రితం

10 kg of ganja seized - two arrested
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 04:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- గోకవరం (తూర్పు గోదావరి) : 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని, ఇద్దరిని అరెస్టు చేసిన సంఘటన గోకవరంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం .... మండల కేంద్రమైన గోకవరం తంటికొండ గ్రామం వెళ్లే రహదారి ఆర్చి సమీపంలో రంపచోడవరం నుండి రాజమహేంద్రవరం వెళ్లే ఎన్ హెచ్ 516 జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అదే గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు, ద్రాక్షారామం మండలం అదే గ్రామానికి చెందిన కర్రీ సాయి రెడ్డి లను పోలీసులు గుర్తించారు. వారిద్దరినీ అరెస్టు చేశారు. వారి వద్ద 10 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయితోపాటు వారివద్ద నుండి ఒక సెల్ ఫోన్, రూ.1500 నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు కోరుకొండ సిఐ మూర్తి, ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్