శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై సిపిఐ(యం) అసంతృప్తి

1 గంట క్రితం

CPI(M) expresses dissatisfaction with the SIR process in the state
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 04:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వాస్తవాలు బహిరంగపరచాలని డిమాండ్


విజయవాడ : రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) తీరు గురించి.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఇచ్చిన వివరణ పై సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓటర్లను ఎవరూ వదిలివేయకూడదనే సిఇఒ ప్రకటనకు, ఆచరణలో అమలు జరిగినదానికి ... తేడా ఉందని వాటితో సమగ్ర విచారణ జరగాలని సిపిఐ(యం) కోరింది. దీనికి సంబంధించి శనివారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఫారం-7 పై వచ్చిన వార్తలకు సిఇఒ ప్రకటనలో ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం అనుమానాలకు దారితీస్తున్నదని అన్నారు. అక్టోబర్ 14 నాటికి రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,75,69,896 అని ఎన్నికల సంఘం ప్రకటించిందని తెలిపారు. ముసాయిదా జాబితా విడుదల తరువాత 44,89,512 ఓట్లు తొలగించి, అభ్యంతరాలు స్వీకరించిన తరువాత 3,31,052 మళ్ళీ తొలగించారనీ, దీనికి కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. అనుమానాలు నివృత్తి చేయవలసిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని స్పష్టం చేశారు. ఫారం-6 లో ఉన్న వాటికి సమాధానం రాయలేక ఇవ్వనివారు, అందుబాటులో లేనివారు ఎంతమందిని తొలగించారో తెలియదు అని, ఈఆర్‌వో లు బల్క్‌గా ఎంట్రీ వేసి ఓటర్లను తొలగించారనే వార్తలు కూడా వచ్చాయని తెలిపారు. కొత్తగా చేర్చిన ఓటర్లు 7,62,766 అని ప్రకటించారు... కానీ మొత్తం దరఖాస్తు చేసుకున్నవారెంతమంది, తిరస్కరించినవారెందరు ? తదితర వివరాలన్నీ కారణాలతో సహా బహిరంగంగా ప్రకటించాలని కోరారు. పూర్తి వివరాలు రాజకీయ పార్టీలకు, ఆయా ప్రాంతాల బిఎల్ ఏ లకు అందించాలన్నారు. వివిధ రాష్ట్రాలలో ఓటర్ల తొలగింపు, సుప్రీం కోర్టు జోక్యం, ఎన్నికల ప్రధానాధికారిపై ఆరోపణల నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ అమలులో మన రాష్ట్రంలో అనేక లోపాలు జరిగాయని సిపిఐ(యం) భావిస్తున్నదని వివరించారు. అందువల్ల తక్షణం ఎస్ఐఆర్ ప్రక్రియను నిలుపుదల చేయాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
cpim
pamplet


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్