హైదరాబాద్ : సినీనటి ప్రియా భవానీ శంకర్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ప్రియుడు రాజ్ తో ఆమె వివాహం నవంబర్ 11 న చెన్నైలో సన్నిహితుల సమక్షంలో ఆహ్లాదంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా .. అభిమానులు, ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. న్యూస్ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన తమిళమ్మాయి ప్రియా భవానీ శంకర్.. మిడ్ రేంజ్ సినిమాల హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తెలుగులో కళ్యాణం కమనీయం, భీమా, జీబ్రా మూవీస్ చేసింది. కానీ ఇవన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులో వచ్చిన 'ఇరుముడి'తో అద్భుతమైన హిట్ కొట్టింది. వ్యక్తిగత విషయానికొస్తే.. తన కాలేజీ రోజుల నుంచే అంటే గత పదేళ్లుగా క్లాస్‌మేట్ రాజ్ వేల్‌తో ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని చాన్నాళ్ల క్రితమే రివీల్ చేశారు. ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
పదేళ్ల ప్రేమ - వివాహబంధంలోకి 'ఇరుముడి` హీరోయిన్
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026, 12:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)