హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ ఇంట విషాదం నెలకొంది. ఈ విషయమై ఇతడి కూతురు పవిత్ర ఓ పోస్ట్ పెట్టింది. నానమ్మ చనిపోయిన సంగతిని సోషల్ మీడియాలో పంచుకుంది. శనివారం తన నానమ్మ చనిపోయినట్లు వెల్లడించింది. 'ఇప్పుడు నన్నెవరు చిన్నతల్లి అని పిలుస్తారు ? ప్రేమగా నన్నెవరు ముద్దుపెట్టుకుంటారు ? నీతో మరో రోజు గడిపే అవకాశమొస్తే బాగుండు. నీ 96 వ పుట్టినరోజున ఇచ్చినట్లు పెద్ద హగ్ ఇస్తా. ఐ మిస్ యూ నానమ్మ' అని పూరీ జగన్నాధ్ కూతురు పవిత్ర.. ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. పూరీ జగన్నాథ్ సినిమాల విషయానికొస్తే.. లైగర్, డబుల్ ఇస్మార్ట్ మూవీస్‌తో దెబ్బతిన్న ఈ దర్శకుడు, విజయ్ సేతుపతితో 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' అనే చిత్రాన్ని తీశాడు. దీని షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ కారణమేంటో తెలీదు గానీ ఇప్పటికీ రిలీజ్ ఊసు లేదు. ఓటీటీ డీల్ కాకపోవడం వల్లే రిలీజ్ విషయంలో టీమ్ తర్జనభర్జన పడుతోందని అంటున్నారు.








కామెంట్‌లు (0)