మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

"హాస్పిటల్లో చనిపోయి 5 గంటలు వేచి ఉన్నారు. తర్వాత అంబులెన్స్..!

26 జులై, 2026

They waited for five hours after the death at the hospital. Then came the ambulance!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 05:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రావికమతం (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పితృగడ్డ Pvtg కొందు గిరిజన గ్రామం. కొర్ర సుబ్బారావు (56) సంవత్సరాలు. నర్సీపట్నం హాస్పిటల్ లో వైద్యం పొందుతూ ఈరోజు తెల్లవారుజాము ఎనిమిది గంటలకి మరణించారు. తన కుటుంబం వద్ద డబ్బులు లేవు. హాస్పటల్ సిబ్బందిని మాకు అంబులెన్స్ ఇవ్వండని అడిగితే ఏజెన్సీ ప్రాంతం వరకు మాత్రమే మేము ఐటిడీ ఏ అంబులెన్స్ ఇస్తాం. కొండ కిందికి గ్రామాలకి మాకు సంబంధం లేదని తిరిగి వచ్చారు. ఈ విషయంపై నర్సీపట్నం ఏరియా సూపర్డెంట్ గారికి. ఫోన్ చేసి అడగ్గా ... మీరు ఏజెన్సీ అంబులెన్స్ తీసుకెళ్లండి అని. చెప్పారు. ఏం చేయాలో తెలియక సుబ్బారావు కుమారుడు కొర్ర కొండబాబు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావుకి ఫోన్ చేసి. మాకు అంబులెన్స్ ఇవ్వడం లేదు. మా చేతిలో డబ్బులు లేవు. మాకు అంబులెన్స్ ఇప్పించండి అని ఫోన్ చేయగా. ఈ విషయం నర్సీపట్నం ఆర్డిఓ గారికి ఫోన్ చేసి చెప్పగా. అడిషనల్ డీఎండీవో గారికి చెప్పామని సీసీ గారు చెప్పారు. అప్పటికి మధ్యాహ్నం ఒంటిగంట అయింది. అంబులెన్స్ ఇవ్వకపోవడంతో.. పాడేరు iTDA PO గారికి ఫోన్ చేసి చెప్పగా. నర్సీపట్నం ఏరియాలో హాస్పటల్లో అంబులెన్స్ ని డెడ్ బాడీని. ఒంటిగంటన్నరకి అంబులెన్స్ ఎక్కించి. పిత్రి గడ్డి గ్రామానికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో నాన్ షెడ్యూల్ గిరిజనుల మరణిస్తే. అంబులెన్స్ ఏర్పాటు చేసే విధంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు. చర్యలు తీసుకోవాలని. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. Po గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కొర్ర సుబ్బారావు కుమారుడు కొండబాబు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు పి ఓ గారికి అభినందనలు తెలియజేయడం జరిగింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్