ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

హార్ముజ్ జలసంధిపై ఒమన్‌తో చర్చల్లో పురోగతి : ఇరాన్

1 గంట క్రితం

Esmaeil Baqaei
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 05:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టెహ్రాన్ : హార్ముజ్ జలసంధి నిర్వహణకు సంబంధించి ఒమన్‌తో చర్చల్లో పురోగతి సాధించినట్లు ఇరాన్‌ ఆదివారం ప్రకటించింది. ఈ జలసంధిపై నియంత్రణను కఠినతరం చేసేందుకు ఇరాన్‌ పార్లమెంట్‌ చట్టాన్ని చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఖాయీ తెలిపారు. శుక్ర, శని వారాల్లో టెహ్రాన్‌లో ఇరాన్, ఒమన్‌ ఉప విదేశాంగ మంత్రుల మధ్య పలు దఫాల చర్చలు జరిగాయని, రెండు దేశాల సార్వభౌమ హక్కులను గౌరవిస్తూనే సురక్ష‍ితమైన నౌకాయానానికి అవసరమైన ఉమ్మడి సూత్రాలు, కార్యాచరణ విధానాలపై చర్చించినట్లు తెలిపారు. చర్చలు ప్రయోజనకరంగా సాగాయని, పురోగతి సాధించినట్లు ఇస్మాయిల్‌ బఖాయీ స్పష్టం చేశారు. ఒమన్ ప్రతినిధి బృందం శనివారం టెహ్రాన్ నుంచి వెళ్లిపోయినప్పటికీ, సాంకేతిక, రాజకీయ స్థాయిలో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం హార్ముజ్‌ జలసంధి మీదుగా సాగే రవాణా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్