శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జనరల్‌ బోగీలో ప్రయాణిస్తూ...

7 గంటల క్రితం

జనరల్‌ బోగీలో ప్రయాణిస్తూ... image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 07:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ తాజాగా ‘అప్పాకుట్టి’ సినిమాలో నటించారు. తెలుగులో ‘నాన్న కుట్టి’ పేరుతో నవంబర్ 20న విడుదలైన ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన వినూత్నంగా ప్రమోషన్స్‌ చేస్తున్నారు. తాజాగా చెన్నై నుంచి కోయంబత్తూర్‌ వెళ్లే కోవై ఎక్స్‌ప్రెస్‌లో జనరల్‌ బోగీలో ప్రయాణిస్తూ ప్రయాణీకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన సినిమా విశేషాలను వారితో పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలను ట్రావెల్‌ వ్లాగ్‌గా చిత్రీకరించారని, త్వరలోనే దాన్ని సోషల్‌ మీడియాలో విడుదల చేయనున్నట్లు ఆయన టీమ్‌ తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్