గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సినీనటి త్రిష పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు

04 ఆగస్టు, 2026

Udhayanidhi Stalin's controversial comments on actress Trisha.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 09:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తమిళనాడు : తమిళనాడులో డిఎంకె నిర్వహించిన ఓ పార్టీ సమావేశంలో ఆ పార్టీ కీలక నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ముఖ్యమంత్రి విజయ్ గురించి మాట్లాడుతున్న సమయంలో సభలో ఉన్న కార్యకర్తలు, స్థానిక నేతలు ఒక్కసారిగా "త్రిష.. త్రిష.." అంటూ నినాదాలు చేయడం కనిపించింది. అయితే వారిని వెంటనే వారించకుండా, వారితో కలిసి ఉదయనిధి స్టాలిన్ నవ్వినట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. ఒక మహిళ పేరును రాజకీయ వేదికపై ఈ విధంగా ప్రస్తావించడం, ఆ సమయంలో అలా స్పందించడం సమంజసం కాదంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. బిజెపి సీనియర్ నేత తమిళిసై సౌందరరాజన్ ఉదయనిధి స్టాలిన్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయాల్లో మహిళలను, వారి వ్యక్తిగత జీవితాలను లాగడం సరైన పద్ధతి కాదని ఆమె విమర్శించారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం ప్రజాప్రతినిధులకు తగదని, రాజకీయ విమర్శలు వ్యక్తిగత స్థాయికి వెళ్లకూడదని పేర్కొన్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, పలువురు నెటిజన్లు మహిళలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అలాంటి ప్రవర్తనను ప్రోత్సహించడం బాధ్యతారాహిత్యమని అభిప్రాయపడ్డారు. తాజా వివాదంపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్ .... తాను ఎవరినీ అవమానించే ఉద్దేశంతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. సభలో జరిగిన ఘటనను కొందరు తప్పుగా అర్థం చేసుకుని అనవసర వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళలను అవమానించడం తన ఉద్దేశం కాదని, వైరల్ అవుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా, మహిళల గౌరవం, రాజకీయ నాయకుల బాధ్యతాయుత ప్రవర్తనపై మరోసారి చర్చకు తెరలేపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్