గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘మమ్మల్ని ఇండియన్స్ అని పిలవండి..’

2 గంటల క్రితం

girl
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 07:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సోషల్‌ మీడియాలో వైరల్‌గా చిన్నారి వీడియో

ఇటానగర్‌ : ‘‘మేం ఇండియన్స్‌.. చైనీస్‌ అని పిలిస్తే చాలా కోపం వస్తుంది.. బాధగా ఉంటుంది. మమ్మల్ని ఇండియన్స్‌ అని పిలవండి’’ అంటూ అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ చిన్నారి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తనను చైనీస్‌ అని ప్రశ్నించిన వ్యక్తికి ఆ చిన్నారి చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌కు చెందిన ఆ చిన్నారిని ఓ వ్యక్తి ‘నువ్వు చైనీస్‌వా?’ అని అడగడంతో ఈ వీడియో మొదలవుతుంది. ‘మేము భారతీయులం. మీరు మమ్మల్ని చైనీస్ అని పిలిస్తే మాకు చాలా కోపం వస్తుంది, చాలా బాధగా ఉంటుంది. మమ్మల్ని ఇండియన్ అని పిలవండి. మేము ఇండియాకు చెందిన వాళ్లం. మేము ఇటానగర్‌లో నివసిస్తున్నాం’ అని ఎంతో స్పష్టంగా బదులిచ్చింది. ఆ ప్రశ్నను తేలికగా తీసుకోకుండా, ఆ మాటల వల్ల తానెందుకు బాధపడ్డానో వివరిస్తూనే.. తాను ఎక్కడికి చెందిన వ్యక్తినో ఆ చిన్నారి గర్వంగా తెలియజేసింది. కాగా, ఈశాన్య రాష్ట్రాల ప్రజలను చైనీయులని, నేపాలీలని పిలవడం కేవలం అమాయకపు అపోహలు కావని, అవి వారిని మానసికంగా గాయపరిచే జాత్యహంకార వ్యాఖ్యలని పలువురు యూజర్లు ఈ వీడియో ద్వారా ప్రశ్నించారు.

https://www.instagram.com/reel/DcQIG9ESKvU/?utm_source=ig_embed&ig_rid=AllZZUQSOZgFDpYRNSb17La

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్