హైదరాబాద్ : స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' చిత్రంలోని అత్యంత క్లిష్టమైన అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా ఇలాంటి అండర్‌వాటర్ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరించలేదని చిత్ర బృందం వెల్లడించింది. దీంతో ఈ తరహా సాహసోపేత సన్నివేశాన్ని పూర్తి చేసిన తొలి భారతీయ హీరోయిన్‌గా రష్మిక నిలిచారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో స్పందించిన రష్మిక, ఇటీవల కొన్ని రోజులుగా తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి ఇదే కారణమని వివరించారు.
" నేను కొంతకాలంగా సోషల్ మీడియాలో కనిపించకపోవడాన్ని చాలామంది గమనించి ఉంటారు. ఆ సమయంలో మా టీమ్ అంతా ఈ భారీ అండర్‌వాటర్ సీక్వెన్స్ చిత్రీకరణలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాం. నా సినీ ప్రయాణంలో ఇప్పటివరకు చేసిన అన్ని సన్నివేశాల్లో ఇదే అత్యంత సవాలుతో కూడుకున్నది. దీని కోసం ఎంతో శ్రమించాం. అయితే ఈ అనుభవం నాకు ఎంతో ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది " అని రష్మిక పేర్కొన్నారు.
ఈ ప్రమాదకరమైన యాక్షన్ ఘట్టాన్ని రష్మిక ఎలాంటి డూప్‌ను ఉపయోగించకుండా స్వయంగా పూర్తి చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. నీటి అడుగున చిత్రీకరించిన ఈ క్లిష్టమైన ఫైట్ సీక్వెన్స్ కోసం ఆమె రెండు రోజులపాటు దాదాపు 20 గంటల సమయం నీటిలోనే గడిపిందని వివరించింది. ఈ అండర్‌వాటర్ యాక్షన్ సన్నివేశం భారతీయ సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలుస్తుందని, అలాగే 'మైసా' చిత్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘట్టంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.








కామెంట్‌లు (0)