తన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందనే ఆలోచన లేకుండా 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47' చిత్రంలో తల్లి పాత్ర పోషించానని నటి శ్రీనిధి శెట్టి తెలిపారు. కథ నచ్చితే భవిష్యత్తులోనూ ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమని చెప్పారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా కనిపించనున్నారు. అక్టోబర్ 9న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు పంచుకున్నారు. 'నేను తొలుత సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాను. నటనపై ఆసక్తితోనే ఆ ఉద్యోగాన్ని వదిలి సినీరంగంలోకి వచ్చాను. ఈ సినిమాలో తల్లి పాత్రలో నటించడం నా కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించడం లేదు. సినిమా చూశాక నేనెందుకు ఈ పాత్రను ఎంచుకున్నానో మీకే అర్థమవుతుంది. వెంకటేష్‌తో కలిసి నటించడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను' అని శ్రీనిధి శెట్టి వెల్లడించారు.
కథ నచ్చే తల్లి పాత్రలో నటించా...
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 02, 2026, 06:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)