గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కత్తిపూడిలో దారుణం..

1 గంట క్రితం

Scorpio vehicle ploughs into Bhavani pilgrims four dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 11:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రోడ్డు దాటుతున్న భవానీ మాలధారులపై దూసుకెళ్లిన కారు

  • నలుగురు మృతి

ప్రజాశక్తి- యంత్రాంగం: కాకినాడ జిల్లా కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా డెంకాడ దళితకాలనీకి చెందిన 40 మంది భవానీ మాలధారులు బుధవారం రాత్రి ఒక ప్రైవేటు బస్సులో విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తుండగా.. కత్తిపూడి సమీపాన జాతీయ రహదారిలో బస్సు ఆగిపోవడంతో రిపేరీ కోసం రావికంపాడు జంక్షన్ వద్ద ఆపారు. ఇంతలో టీ తాగడం కోసమని మాలధారుల్లో ఆరుగురు రోడ్డు దాటేందుకు యత్నిస్తుండగా..ఈ లోగా రహదారిపై వేగంగా వస్తున్న స్కార్పియో కారు వారిని ఢీకొనింది. దీంతో, ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరొకరు మరణించారు. బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. మృతులను సిరిగిడి ఎర్రయ్య (40), లింగాల సీతారాం (36), తాటిపూడి వరప్రసాద్ (38), బోనుల రమణ సత్తిబాబు (52)గా గుర్తించారు. దీంతో డెంకాడలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ప్రమాదానికి కారణమైన కారులోనూ భవానీమాధారులే ఉండటం గమనార్హం. వీరంతా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల గ్రామం నుంచి విజయవాడ దుర్గగుడికి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం పట్ల ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ‌కాగా భవానీ మాలధారుల మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షులు జగన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్