మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నటి అనన్య మృతి

19 గంటల క్రితం

ananya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 09:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సినీ నటి అనన్యరాజ్ జూలై 15న నిద్రలోనే చనిపోయినట్లు దాదాపు నెల రోజుల తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. గత ఏడాది కాలంగా ఆమె తీవ్ర శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ‘తన అనారోగ్య సమస్యలపై ఆమె పోరాడింది. రాణిలా జీవించింది.’అని కుటుంబ సభ్యులు ఆ ప్రకటనలో తెలిపారు. ఆమె అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. కాగా, అనన్య ‘7 అవర్స్ టు గో’ (2016), ‘ది ఫైనల్ ఎగ్జిట్’ (2017), ‘ఘోస్ట్’ (2019) వంటి హిందీ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత 2022లో వచ్చిన ‘తగ్గేదే లే’ సినిమాలో హీరో నవీన్ చంద్రకు జోడీగా నటించారు. ‘మద్రాసీ గ్యాంగ్’ అనే త్రిభాషా (తమిళ, తెలుగు, హిందీ) చిత్రంతో పాటు మరో సినిమా పూర్తి కావాల్సి ఉండగా, ఆమె మృతి చెందారు. అనన్య మృతికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్