బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఏఐ నన్ను భయపెడుతోంది!

1 గంట క్రితం

ఏఐ నన్ను భయపెడుతోంది! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 08:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కృత్రిమ మేధ (ఏఐ) తనను తీవ్రంగా భయపెడుతోందని ప్రముఖ నటి కృతి సనన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, దాన్ని నియంత్రించే చట్టాలు అదే స్థాయిలో లేవని ఓ మీడియా సమ్మిట్‌లో అన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోలికలతో ఏఐ రూపొందించిన చిత్రాలను ఎవరైనా పోస్ట్‌ చేస్తే, వాటిని తొలగించేందుకు ప్రత్యేకంగా ఫిర్యాదు చేసే అవకాశం కూడా అందుబాటులో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంకేతికత మారుతున్నా, సామాజిక మాధ్యమాల నిబంధనలు అందుకు అనుగుణంగా మారడం లేదని అభిప్రాయపడ్డారు. ఏఐ ఒక సాధనం మాత్రమేనని, అయితే అది ఎంత శక్తిమంతంగా ఉంటే అంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. కొత్త ఆవిష్కరణలకు తాను వ్యతిరేకం కాదని, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించేలా ఏఐ వినియోగంపై కఠినమైన చట్టాలు తక్షణమే తీసుకురావాలని కృతి సనన్‌ కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్