శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘అయిగిరి నందిని..’ పాట విడుదల

1 గంట క్రితం

‘అయిగిరి నందిని..’ పాట విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 07:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి రాబోతున్న చిత్రం ‘మహాకాళి’. ఈ సినిమా నుంచి తాజాగా ‘అయిగిరి నందిని’ భక్తి గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. స్మరణ్‌ సాయి స్వరాలు సమకూర్చిన ఈ పాటను అనిలా రాజీవ్‌, గీతా మాధురి, సాయిచరణ్‌ ఆలపించారు. ‘హనుమాన్‌’తో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్‌ వర్మ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్‌ ఖన్నా, శ్రియారెడ్డి, భూమి శెట్టి, ఖుష్బూ, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్‌కేడీ స్టూడియోస్‌ పతాకంపై రివాజ్‌ రమేష్‌ దుగ్గల్‌ నిర్మిస్తున్నారు. జనవరి 8న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్